కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నరు

కావాలనే కేసుల్లో  ఇరికిస్తున్నరు

 కేరళలో కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల వద్ద సీపీఎం నిరసనలు

 కొచ్చి: ఎన్నికల టైమ్లో రాజకీయంగా లబ్ది పొందేందుకే డాలర్ స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు తమను ఇరికిస్తున్నారని సీపీఎం నేతృత్వంలోని ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌ మండిపడింది. కేరళలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద సీపీఎం నేతలు శనివారం నిరసనలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమపై కేసులు పెడుతు న్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు, దర్యాప్తు చేస్తున్న వారిని బెదిరించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తోందని కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు తెలిపారు. పోయినేడాది జులై 5న తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న పార్శిల్స్‌‌‌‌‌‌‌‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు స్వాధీనం చేసుకున్న కేసులో స్వప్నా సురేశ్‌‌‌‌‌‌‌‌ సహా పలువురిని అరెస్టు చేశారు. విచారణలో సీఎం పినరయి విజయన్‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.శ్రీరామకృష్ణన్‌‌‌‌‌‌‌‌ సహా మరో ముగ్గురు మంత్రులకు కేసుతో సంబంధాలున్నట్టు నిందితురాలు వెల్లడించిందని కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు హైకోర్టులో అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు.